ఉత్తరాఖండ్‌లోని ఆర్మీలో కరోనా కలకలం

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో 110 మంది ఆర్మీ సిబ్బందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సంగ్ రావత్ తెలిపారు. అక్కడ ఇటీవల కాలంలో ఆర్మీ సిబ్బందికి ఎక్కువగా కరోనా సోకుతుందని చెప్పారు. గత రెండుమూడు రోజుల్లోనే 100 మందికి పైగా కరోనా సోకిందని అన్నారు. అయితే వీరికి కరోనా ఎలా సోకిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వారు ఏయే ప్రాంతాలకు వెళ్లారో అధికారిక రికార్డుల్లో నమోదై ఉంటుందని.. దీంతో వారికి కరోనా ఏ ప్రాంతంలో సోకిందో తెలుసుకోవచ్చని అన్నారు. కాగా.. ఇప్పటి వరకూ ఉత్తరాఖండ్‌లో 4102 మందికి కరోనా సోకింది. ఇందులో 3వేల మందికి పైగా కరోనా నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. 1030 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 18 కరోనా కాటుకు బలైయ్యారు.

Tags

Next Story