మనసులేని కరోనా.. మనుషుల్లో మానవత్వాన్ని..

మనసులేని కరోనా.. మనుషుల్లో మానవత్వాన్ని..
X

సాయం చేయాలని ఉన్నా అది కూడా ఓ పెద్ద సాహసం లాగే అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో.. రేపు మనపరిస్థితి ఎలా ఉంటుందో అని మనసు గొడవ చేస్తున్నా ధైర్యం చేసి అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నారు. పాజిటివ్ వచ్చి రోడ్డు మీద పడిపోతే ఒక్కరూ సాయం అందించలేకపోయారు. ప్రాణం పోయిన మనిషిని నిర్ధాక్షణ్యంగా రోడ్డు మీదే వదిలేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వావిలాలవారి వీధికి చెందిన వ్యాపారి (60)కి కరోనా పాజిటివ్ అని ఆదివారం రిపోర్ట్ వచ్చింది. దాంతో ఆందోళన చెందిన అతడికి ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆసుపత్రికి వెళ్లబోతుంటే రోడ్డుమీదే కుప్పకూలిపోయారు. తండ్రి పడిపోయాడని సాయం చేయమంటూ కుమార్తె చుట్టుపక్కల వారిని అర్థించింది. అయినా అతడు కరోనాతో మరణించాడని బంధువులు గానీ, స్థానికులు గానీ ఒక్కరూ స్పందించలేదు. నగర పాలక సంస్థ వారు సాయింత్రం 5 గంటలకు వచ్చి శవాన్ని తీసుకెళ్లి దహనం చేయించారు.

Tags

Next Story