హౌస్‌ఫుల్ కాదు.. అయినా 'సినిమా' చూపిస్తున్నారు

హౌస్‌ఫుల్ కాదు.. అయినా సినిమా చూపిస్తున్నారు

ప్రపంచం మొత్తానికి ఒకటే సినిమా చూపిస్తోంది చైనా గత నాలుగు నెలలుగా. ఆ రోజు నుంచి కరోనా భయంతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే థియేటర్లన్నీ షట్ డౌన్ అయ్యాయి. చైనా వైరస్ నిరోధానికి పగడ్భంధీ చర్యలు అవలంభించి చాలా వరకు కట్టడి చేయగలిగింది. దాంతో ధైర్యంగా ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేసి సినిమా చూడ్డానికి ప్రేక్షకులను ఆహ్వానిస్తున్నారు. ప్రేక్షకులు సామాజిక దూరాన్ని పాటించేందుకు వీలుగా ఇద్దరి మధ్య ఒక కుర్చీని ఖాళీగా వదిలేస్తున్నారు. దీంతో చైనాలోని హాంగ్‌జోవ్‌ ప్రాంతంలో థియేటర్లు సినిమా ప్రియులతో సందడిగా మారాయి.

వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న మరికొన్ని ప్రాంతాలు షాంఘై, గుయిలిన్ ప్రాంతాల్లో కూడా థియేటర్లు తెరుచుకున్నాయి. కఠినమైన నిబంధనలు అనుసరిస్తూ ప్రేక్షకులకు సినిమా చూపిస్తున్నారు థియేటర్ యాజమాన్యాలు. థియేటర్ కు వచ్చే ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. అలాగే సీటుకి సీటుకి మధ్య ఖాళీ, ఆ ఖాళీలో ఒక్కో థియేటర్ లో టెడ్డీబేర్ లు ఉంచుతున్నారు. అలాగే ప్రతి షో తర్వాత థియేటర్ ను శానిటైజ్ చేస్తున్నారు. మన దేశంలో కూడా ఇలాంటి చర్యలే అవలంభించి సినిమా చూసే అవకాశం వస్తే బావుండని ప్రతి ప్రేక్షకుడూ కోరుకుంటున్నాడు. అయితే నిజంగా థియేటర్లు ఓపెన్ చేస్తే సినిమాకు వచ్చేవాళ్లు ఎంతమందో.. కరోనా భయం వీడనంత వరకు ఈ పరిస్థితి తప్పదు.

Tags

Read MoreRead Less
Next Story