ఒడిశాలో 20వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

ఒడిశాలో 20వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
X

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక ఒడిశాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. తాజాగా మంగళవారం 647 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారినపడి 457 మంది కొలుకొని డిశ్చార్జి అయ్యారని ఆ రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం 18,757 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి రాష్ట్రవ్యాప్తంగా 12,910 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 103 మంది మృతి చెందారు.

Tags

Next Story