సబ్ జైలులో 67 మందికి కరోనా పాజిటివ్

మధ్యప్రదేశ్‌లో కరోనా స్వైర విహారం చేస్తోంది. రోజు రోజుకీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని సబ్ జైలులో ఒకే రోజు భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రైసెన్ జిల్లాలోని బరేలి సబ్ జైలులో సోమవారం 67 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 64 మంది జైలు ఖైదీలు, ముగ్గురు హోంగార్డులకు వైరస్ సోకింది.
ఈ నేపథ్యంలో తూ కొవిడ్ పాజిటివ్‌గా గుర్తించిన 22 మంది ఖైదీలు, సిబ్బందిని పొరుగున ఉన్న విదిషా జిల్లాలోని మెడికల్ కళాశాలకు తరలిస్తున్నామని మధ్యప్రదేశ్ జైళ్ల డీజీ సంజయ్ చౌదరి తెలిపారు. మిగతా వారిని బరేలి జైలులో ఉంచి వైద్యసేవలందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, 82 మంది ఖైదీలున్న జైలులో 67 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కొత్తగా చేరిన ఖైదీల కారణంగా వైరస్ వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com