ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనాకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం: సత్యేంద్రజైన్

ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనాకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం: సత్యేంద్రజైన్
X

కరోనా నుంచి కోలుకొని సోమవారమే విధుల్లో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ వరుసగా వైద్యాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌కు మెరుగైన చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు. ముందుగా తాను ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందినా.. ప్లాస్మా థెరపీ కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరానని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లాస్మా థెరఫీ చికిత్సకు ఇచ్చిన అనుమతి గడువుతీరడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి మారాల్సివచ్చిందని అన్నారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ కరోనా సోకడంతో జూన్‌ 17న రాజీవ్‌ గాంధీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించి ఆక్సిజన్‌ను అందించారు. ప్లాస్మా థెరఫీ నిర్వహించిన అనంతరం మంత్రి జైన్‌ ఆరోగ్యం మెరుగుపడింది.

Tags

Next Story