ఈ ఏడాది విద్యా సంవత్సరం రద్దు.. జీరో ఇయర్!!

ఈ ఏడాది విద్యా సంవత్సరం రద్దు.. జీరో ఇయర్!!
X

బడి ఎప్పుడు తెరవాలి.. పిల్లలకి చదువెట్లా చెప్పాలి. కరోనా భయం వెంటాడుతుంటే విద్యార్థులను పాఠశాలలకు రమ్మని ఎలా అనాలి. ఇవి ఉపాధ్యాయులను, అధికారులను వేధిస్తున్న ప్రశ్నలు. అటు తల్లిదండ్రులు కూడా అంతే ఆందోళన చెందుతున్నారు. ఏదో విధంగా ఆన్ లైన్ లో చదువుకుంటున్నారు కదా.. విద్యా సంవత్సరం ఏమీ నష్టపోరు.. అసలే అరకొర సౌకర్యాలతో చాలా పాఠశాలలు నడుస్తుంటాయి. దానికి తోడు కరోనా కూడా తోడయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో బడులు తెరిస్తే విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నట్లే అని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థుల ప్రాణాల కంటే విద్యా సంవత్సరం ముఖ్యం కాదని, కరోనా ఉధృతి తగ్గిన తరువాతే పాఠశాలలు ప్రారంభించాలని కోరుతున్నారు. పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించాలంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదివారం అన్ని రాష్ట్రా విద్యాశాఖ కార్యదర్శులను కోరింది. ఇప్పటికే సేకరణ ప్రారంభమైన కొన్ని జిల్లాలలో తల్లిదండ్రులు పై విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేసులు పెరుగుతున్నందున మండల, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులు, సిబ్బందే రావడం లేదని వారు గుర్తుచేస్తున్నారు.

పది, ఇంటర్ విద్యార్థులకు కీలకమైన పబ్లిక్ పరీక్షలను పెట్టకుండా అందర్నీ ప్రమోట్ చేసినప్పుడు ఇక 1 నుంచి 9 తరగతి విద్యార్థులను కూడా పై తరగతులకు ప్రమోట్ చేయమంటున్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని రద్దుచేసి జీరో ఇయర్ గా ప్రకటించాలని కొందరు తల్లిదండ్రులు సూచించారు. పాఠశాల పునః ప్రారంభం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించింది. ఈ వివరాలతో పాటు యూటీఎఫ్ సూచనలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు ఈ మెయిల్ ద్వారా పంపించినట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, రవి తెలిపారు.

Tags

Next Story