తెలంగాణలో ఒక్కరోజే 1,554 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణలో ఒక్కరోజే 1,554 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణలో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం రాష్ట్రంలో 1,554 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 842 కేసులు నమోదయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 49,259 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే తొమ్మిది మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 438కి చేరింది. రాష్ట్రవ్యాపంగా కరోనా బారి నుంచి కోలుకుని మొత్తం 37,666 (76.5%) మంది డిశ్చార్జి అయ్యారు. మరో 11,155మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story