కొత్త యాంటీజెన్ కిట్ ఆమోదముద్రవేసిన ఐసీఎంఆర్

కరోనా నిర్థారణ పరీక్షల కోసం ఐసీఎంఆర్ యాంటీజెన్ కిట్ కు ఆమోదముద్రవేసింది. ఈ కిట్‌ను మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు ఉన్న అన్ని టెస్టు కిట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే..కానీ, ఇది మాత్రం భారతదేశంలో తయారు చేసిన మొదటి టెస్ట్ కిట్. ఇది తక్షణమే ఆర్డర్ చేసేందుకు అందుబాటులో ఉంటుంది. దీని ధర సుమారు రూ. 450 రూపాయలుగా ఉండ‌నుంది. అంటువ్యాదులపై పోరాడేందుకు మైలాబ్ బృందం తీవ్రంగా కృషి చేస్తుందని ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హస్‌ముఖ్ రావల్ అన్నారు. విదేశీ సమాగ్రిపై ఆధారపడకపోవడంతో ఈ కిట్ ధరలు అందుబాటులో ఉంటాయని అన్నారు.

Tags

Next Story