అసోం వరదల్లో పెరుగుతున్న మరణాల సంఖ్య

అసోం వరదల్లో పెరుగుతున్న మరణాల సంఖ్య
X

అసోం వరదల్లో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగున్నాయి. తాజాగా మరో నలుగురు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 93కి చేరింది. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో వరదల ప్రభావం 28,32,410 మంది మీద పడింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వందల ఇళ్లు మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల్లో 300 పశువులు మరణించాయని అధికారులు చెప్పారు. వరదల వల్ల కజిరంగా జాతీయ వనంలోని 143 వన్యప్రానులను సురక్షితప్రాంతాలకు తరలించామని అసోం రాష్ట్ర అటవీశాఖ మంత్రి పరిమల్ సుక్లాబైద్య చెప్పారు.

Tags

Next Story