అసోం జైల్లో కరోనా కలకలం

అసోంలో జైల్లో కరోనా కలకలం రేపుతుంది. గువాహటి సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలకు కరోనా సోకింది. మొత్తం 44శాతం మందికి కరోనా సోకడంతో జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారు. అసోంలోని మొత్తం 10 జైళ్లలో 535 మంది ఖైదీలకు ఈ మహమ్మారి సోకింది. గువహటి జైలులో ఉద్యమనాయకుడు అఖిల్ గగోయ్, స్టూడెంట్ యాక్టివిస్టు షర్జీల్ ఇమాంలకు కరోనా సోకిందని తేలడంతో బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని అసోం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గువాహటిజైలులో ఓవార్డులను కరోనా బాధితుల కోసం 200 పడకలతో కొవిడ్ కేర్ సెంటరును ఏర్పాటు చేశారు. జైళ్లలోని ఖైదీలందరికీ కరోనా పరీక్షలు చేశామని అధికారులు చెప్పారు. గువాహటి సెంట్రల్ జైలుతోపాటు నల్బరి, ధూబ్రీ, కరీంగంజ్, నార్త్ లఖింపూర్, గోలఘాట్, డిఫూ, ఉడాల్ గురి జైళ్లలో ఖైదీల సంఖ్య కెపాసిటీ కంటే అధికంగా ఉన్నందున 376 మంది ఖైదీలను విడుదల చేయాలని జైళ్ల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.

Tags

Next Story