మాస్క్ ధరించకపోతే మూడు నెలల కఠిన శిక్ష!

X
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కఠినమైన నియమాలు పాటిస్తున్నాయి. ఉత్తర కొరియా కూడా మాస్క్‌లు ధరించని వారికి జరిమానా విధిస్తామంటోంది. దేశంలో మాస్క్ ధరించని వారిని గుర్తించి మూడు నెలల కఠిన శిక్ష విధించనున్నట్టు పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా నియంత్రించాలన్న ఉద్దేశంతోనే ఈ కఠినమైన కొత్త నియమాలు విధిస్తున్నట్టు ఉత్తర కొరియా అధికారులు చెప్తున్నారు. పలువురు విద్యార్థులు మాస్క్ పెట్రోలింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. వీరు మాస్క్ ధరించని వారిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
