అమెరికాలో ఒక్కరోజే 76,570 కరోనా పాజిటివ్ కేసులు

X
అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 76,570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి 1225 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇంత భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కరోనా కేసులు 41 లక్షలు దాటాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 41,69,991 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 1,47,333 మంది ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
