వచ్చే నాలుగైదు వారాలు మరింత సంక్లిష్టం.. : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ

వచ్చే నాలుగైదు వారాలు మరింత సంక్లిష్టం.. : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ

వైరస్ తో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు మరో చేదు వార్త వినిపించింది సర్కార్. వైరస్ ప్రభావం వచ్చే నాలుగైదు వారాలు మరింత సంక్లిష్టంగా ఉంటుందని, వైరస్ కమ్యూనిటీలోకి వెళ్లిందని డీఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉండబోతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం కమ్యూనిటీ స్ప్రెడ్ ఉందని చెప్పలేమన్నారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయని అన్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్ట్ లు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. టెస్టుల నిర్వహణకు ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పటికీ 6,500 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని, అన్ని జిల్లా కేంద్రాల్లో చికిత్స చేస్తున్నారని, అత్యవసరమైతేనే రోగులు హైదరాబాద్ రావాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story