ఉత్తరకొరియాకు ఆపన్న హస్తం అందించిన భారత్

ఉత్తరకొరియాకు ఆపన్న హస్తం అందించిన భారత్
X

ఆపద సమయంలో ఉత్తరకొరియాకు భారత్ సాయం చేసింది. టీబీ నిరోధక ఔషధాల కొరతతో ఉత్తరకొరియా సతమతమవుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ.. ఉత్తరకొరియాకు సాయం చేయాలని భారత్ ను కోరింది. దీంతో దాదాపు మిలియన్ డాలర్ల విలువైన టీబీ మందులను ఉత్తరకొరియాకు పంపించేందుకు కేంద్రం నిర్ణయించింది. అక్కడి పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అభ్యర్థన మేరకు ఈ ఔషధాలను పంపిస్తున్నామని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో త్వరలో ఔషధాలకు ఉత్తరకొరియాకు పంపించేందుకు సిద్దమవుతుంది.

Tags

Next Story