మహారాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి 93 మంది పోలీసులు మృతి

మహారాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి 93 మంది పోలీసులు మృతి
X

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజూ వేల‌ల్లో కొత్త పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌హారాష్ట్ర పోలీస్ డిపార్టుమెంట్‌లో సైతం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా బారిన‌ప‌డ్డ పోలీసుల సంఖ్య 8,483కు చేరింది. అందులో 6,471 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కాగా, 1919 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి ఇప్ప‌టివ‌ర‌కు 93 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story