26 July 2020 3:27 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / మాల్దీవులకు...

మాల్దీవులకు చేయూతనివ్వనున్న భారత్

కరోనా కారణంగా మాల్దీవులు ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో మాల్ధీవులకు చేయూతనివ్వడానికి భారత్ మందుకొచ్చింది. త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనుంది. మాల్ధీవుల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మాలేలోని భారత్ హై కమినషర్ మాట్లాడుతూ.. భారత్, మాల్థీవులు మైత్రీ బంధానికి సుదీర్ఘ చరిత్ర ఉందని.. ఈ స్నేహానికి మంచి భవిష్యత్ ఉందని అన్నారు.

కరోనా వలన మాల్దీవులు తీవ్రంగా నష్టపోయిందని.. మాల్ధీవులు పూర్వవైభవం సాధించడానికి భారత్ అండగా ఉంటుందని అన్నారు. కరోనా కాలంలో మెడికల్ సప్లయ్స్, మెడికల్ టీమ్స్, ఆహార సరఫరాలు, ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు గుర్తుచేశారు

అంతేకాకుండా కరోనా కాలంలో మాల్దీవులలో లిక్విడిటీ షార్టేజ్‌ వచ్చిందని.. దీనిని అధిగమించేందుకు 400 మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ అరేంజ్‌మెంట్ చేసినట్లు తెలిపారు. చాలా రకాలుగా మాల్దీవులకు అండగా ఉన్నామని.. త్వరలో మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి ఆర్థిక వ్యవస్థకు అండగా ఉంటామన్నారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story