ఢిల్లీలో కొత్తగా 613 కరోనా పాజిటివ్ కేసులు

ఢిల్లీలో కొత్తగా 613 కరోనా పాజిటివ్ కేసులు
X

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. సోమవారం ఢిల్లీలో 613 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మరి బారి నుండి 1,497 మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా కారణంగా ఒక్కరోజే 26 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ఆరోగ్య బులిటెన్‌లో తెలిపింది.

కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 1,31,219 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,16,372 మంది కరోనా మహమ్మారి బారినుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 10,994 మంది వివిధ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మరి కారణంగా ఇప్పటి వరకు 3,853 మంది మృతి చెందారు.

Tags

Next Story