ముంబై మురికివాడ 'ధారవి'లో ఊహించని మార్పు..

ముంబై మురికివాడ ధారవిలో ఊహించని మార్పు..
X

ఒక్క కరోనా అనే కాదు.. అసలు ఏవ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలన్నా శుభ్రత, ఆరోగ్యం, పోషకాహారం ఈ అన్ని అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మురికి వాడల్లో నివసించే వారికి ఇవన్నీ సాధ్యమయ్యేపనేనా.. అదీకాక ప్రపంచంలోనే అత్యంత రద్దీ ప్రదేశంగా ప్రసిద్ధి పొందినది ముంబై మురికి వాడ ధారవి. ఏప్రిల్ నెలలో ఇక్కడ మొదటి కొవిడ్ కేసు వెలుగు చూడడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెంటనే 'బృహన్ ముంబయ్ కార్పొరేషన్' అప్రమత్తమైంది. మురికి వాడలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేవలం 2.16 చ.కి.మీ విస్తీర్ణం కలిగి, పది లక్షలకు పైగా జనాభా ఉన్న ధారవిలో సామాజిక దూరం అనే పదానికి అర్థం కూడా తెలియదు.. బృహన్ కార్పొరేషన్ అధికారులు పగడ్భంధీ వ్యూహంతో సుమారు 47 వేల గృహాల్లో ఏడు లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ చర్యల ఫలితంగా మే నెలలో అక్కడ రోజుకి 60 కేసులు నమోదైతే, జూన్ నాటికి ఆ సంఖ్య 20కి పడిపోయింది. ప్రస్తుతం పదికన్నా తక్కువ కేసులు ఇక్కడ నమోదవడం అధికారులను కాస్త ఊపిరిపీల్చుకోనిచ్చింది. ఇక ఆదివారం మరికొంత తగ్గి రెండు కేసులే నమోదవడం అత్యంత ఊరటనిచ్చే అంశం. కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేడు ధారవిలో ప్లాస్మా దానం కార్యక్రమాన్ని ఆరంభించనున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు 2531 కొవిడ్ కేసులు నమోదుకాగా, ప్రస్తుతం యాక్గివ్ కేసులు సంఖ్య 113. అంతేకాకుండా కరోనా సోకిన వారిలో 2000 మందికి పైగా కోలుకున్నారు. దాంతో కొవిడ్ బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Tags

Next Story