కరోనా రోగులను సులువుగా గుర్తిస్తున్న ఆర్మీ శునకాలు

కరోనా రోగులను సులువుగా గుర్తిస్తున్న ఆర్మీ శునకాలు
X

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కరోనా రోగులను గుర్తించి వారిని ఆరోగ్యవంతులకు దూరంగా ఉంచడమే ఏకైక మార్గం. అయితే, కరోనా రోగుల్ని గుర్తించాలంటే.. పరీక్షలు జరిపించాలి. అయితే, ఖర్చుతో కూడుకొని ఉన్న టెస్టులు ప్రస్తుతం తలకు మించిన భారంగా మారింది. దీంతో అవకాశం ఉన్నంత వరకూ మాత్రమే టెస్టులు జరుగుతున్నాయి. అయితే, జర్మనీ ఆర్మీ కరోనా రోగులను గుర్తించేందుకు శునకాలకు ట్రైనింగ్ ఇస్తుంది. దీంతో కచ్చితంగా కరోనా రోగులను గుర్తించే అవకాశం ఉంది. జర్మనీకి చెందిన యూనివర్శటీ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఎనిమిది ఆర్మీ శునకాలను ట్రైనింగ్ ఇచ్చారు. తరువాత సుమారు వెయ్యి మంది నుంచి సేకరించిన లాలా జలం శాంపిళ్లను వాటి ముందు ఉంచారు. అందులో కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిళ్లు కూడా వీటిలో ఉన్నాయి. దీంతో ఆర్మీ శునకాలు 94 శాతం కరోనా రోగులను ఖచ్చితంగా కనిపెట్టాయి. వాసనలను పసిగట్టడంలో మనుషుల కంటే వెయ్యిరెట్లు ఎక్కువగా శునకాలు ఖచ్చితంగా పనిచేస్తాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఓ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. కరోనా రోగుల్లోని జీవక్రియలు ఆరోగ్యవంతుల కంటే భిన్నంగా ఉంటాయని ఈ తేడాలను కుక్కులు వాసన ద్వారా సులువుగా గుర్తించగలవని ఆయన తెలిపారు. అయితే యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. వివిధ రకాల రోగాల మధ్య వ్యత్యాసాన్ని శునకాలు కనిపెట్టగలవో లేదో తెలుసుకునేందుకు కొత్త ఆధ్యయనాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.

Tags

Next Story