మరో ఆరునెలలు వర్క్ ప్రం హోం పొడిగించిన గూగుల్

మరో ఆరునెలలు వర్క్ ప్రం హోం పొడిగించిన గూగుల్
X

గూగుల్ యాజమాన్యం కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీంతో గూగుల్ యాజమాన్యం ఉద్యోగులకు 2021 జూలై నెల వరకూ వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు గూగల్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ ఏడాది డిశంబర్ వరకూ వర్క్ ఫ్రం హోం అమలులో ఉంది. కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులతో మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్టు గూగుల్ యాజమాన్యం తెలిపింది. అయితే, గూగుల్ తీసుకున్న నిర్ణయం ఇతర సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Tags

Next Story