29 July 2020 2:03 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / నేడు 'గ్లోబల్ టైగర్...

నేడు 'గ్లోబల్ టైగర్ డే'.. భారత దేశ పులుల సమగ్ర సమాచారం ఇదే..

నేడు గ్లోబల్ టైగర్ డే.. భారత దేశ పులుల సమగ్ర సమాచారం ఇదే..
X

ఈ రోజు గ్లోబల్ టైగర్ డే. ప్రస్తుతం మొత్తం ప్రపంచంలో 4,200 పులులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా 13 దేశాలలోనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ పులులలో 70 శాతం భారతదేశంలోనే ఉన్నాయి. మంగళవారం పర్యావరణ శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ 2018 'పులుల సంఖ్య' గురించి సమగ్ర నివేదికను విడుదల చేశారు. పులుల గణన ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 1973 లో మన దేశంలో 9 టైగర్ రిజర్వులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య 50 కి పెరిగిందని. ఇందులో దాదాపు అన్ని రిజర్వులలో ఉన్న పులులు ఆరోగ్యవంతగానే ఉన్నాయని చెప్పారు. 2022 నాటికి పులుల జనాభాను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో 2010 లో రష్యాలోని పీటర్స్‌బర్గ్‌లో ప్రపంచ పులి శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో మొత్తం 13 టైగర్ రేంజ్ దేశాలు పాల్గొన్నాయి. భారతదేశంతో పాటు, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావో పిడిఆర్, మలేషియా, మయన్మార్, నేపాల్, రష్యా, థాయిలాండ్ మరియు వియత్నాం ఉన్నాయి. 2010 లో నిర్దేశించిన లక్ష్యం వైపు భారత్ వేగంగా కదులుతోంది. ఎనిమిది సంవత్సరాలలో, పులుల వృద్ధి 74 శాతం పెరిగింది. దేశంలో వేగంగా పెరుగుతున్న పులుల వృద్ధితో, భారతదేశం 2022 సంవత్సరానికల్లా లక్ష్యాన్ని సాధించగలదని భావిస్తున్నారు.

2010 - 2018 మధ్య, భారతదేశంలో పులుల సంఖ్య 74 శాతం పెరిగింది. 2022 నాటికి పులుల రెట్టింపు చేయడానికి, ఏ దేశంలోనైనా పులుల సంఖ్య పెరుగుదల ప్రతి సంవత్సరం 9 శాతం కన్నా కొద్దిగా తక్కువ ఉండాలి. కానీ భారతదేశ వృద్ధి రేటు 9% పైన ఉంది. ఈ వృద్ధి రేటు 2022 నాటికి భారతదేశంలో పులుల జనాభాను రెట్టింపు చేయనుంది. ఇక దేశంలోని 20 రాష్ట్రాల్లో మొత్తం 2,967 పులులు ఉన్నాయి. వీటిలో 1,492 పులులు మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే, దేశంలో ఈ మూడు రాష్ట్రాలలోనే 50% కంటే ఎక్కువ పులులు ఉన్నాయి. ప్రపంచ వారీగా పరిశీలిస్తే, మొత్తం పులి జనాభాలో 35% ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 2010 నుండి మధ్యప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాలలో అత్యధిక పులులు ఉన్నాయి. 2010 - 2014 సంవత్సరాల్లో, పులి జనాభా పరంగా కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. కానీ, 2018 టైగర్ సెన్సస్‌లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక భారతదేశంలో, టైగర్ ఆక్రమిత ప్రాంతం 2014 లో 88558 చదరపు కిలోమీటర్లు, ఇది 2018 లో 427 చదరపు కిలోమీటర్లు పెరిగి 88985 చదరపు కిలోమీటర్లకు చేరింది. మధ్యప్రదేశ్ పెంచ్ టైగర్ రిజర్వ్ , అలాగే కేరళలోని పెరియార్ సెంచరీ, దేశంలో ఉత్తమ టైగర్ రిజర్వులుగా ఉన్నాయి.

ఇక తమిళనాడు సత్య మంగళం టైగర్ రిజర్వులో అత్యధిక అభివృద్ధి ఉంది. ఇదిలావుంటే భారతదేశంలో గత 6 సంవత్సరాలలో 560 పులులు చనిపోయాయి, వీటిలో 152 పులుల మరణానికి కారణాలు తెలియలేదు. మిగిలిన 408 పులులు 55 శాతం సహజ మరణాలను పొందగా. 38 శాతం అక్రమ రవాణా, వాహనాల ప్రమాదంలో 4 శాతం పులులు మరణించాయి.

Next Story