కరోనాపై విజయం సాధిస్తాం: కేంద్ర మంత్రి

కరోనాపై విజయం సాధిస్తాం: కేంద్ర మంత్రి
X

కరోనా పోరాటంలో భారత్ విజయం సాధిస్తుందని కేంద్ర ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కరోనా రికవరీ రేటు 64.51గా నమోదైందని ఆయన ట్వీట్ చేశారు. మొత్తం కేసుల్లో 9,88,029 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 5,09,447 మంది చికిత్స పొందుతున్నారని ట్విట్టర్ వేదికగా తెలిపారు. కరోనాతో పారాటంలో మనం విజయం సాధించి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. ప్రపంచ దేశాలతో పోల్చితే.. కరోనా రికవరీ రేటు భారత్ లో చాలా మెరుగ్గా ఉంది.

Tags

Next Story