తమిళనాడులో గడిచిన 24 గంటల్లో కరోనాతో 88 మంది మృతి

తమిళనాడులో గడిచిన 24 గంటల్లో కరోనాతో 88 మంది మృతి
X

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇక తమిళనాడు రాష్ర్టంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 88 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్కరోజే 6,972 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,27,688కి చేరింది. ఇందులో 57,073 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారి నుంచి 1,66,956 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 3,659 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story