మధ్యప్రదేశ్ మంత్రి దంపతులకు కరోనా పాజిటివ్

మధ్యప్రదేశ్ మంత్రి దంపతులకు కరోనా పాజిటివ్
X

దేశవ్యాప్తంగా కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కరోనా బారినపడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ మంత్రి తులసీ సిలావత్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. అయితే, మంత్రి దంపతులకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. కానీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాల మేరకు మంత్రి దంపతులు కరోనా పరీక్షలు చేపించుకున్నారు. లక్షణాలు కనిపించ కుండానే తమకు కరోనా పాజిటివ్ అని తేలిందని.. తాను క్వారంటైన్ కు వెళుతున్నానని అన్నారు. త్వరలో కోలుకొని తిరిగి వస్తానని మంత్రి తులసీ సిలావత్ చెప్పారు. తన స్నేహితులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు.

Tags

Next Story