మరో 236 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

మరో 236 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
X

మహారాష్ట్ర కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక పోలీస్‌శాఖలో కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి బారిన పడుతున్న పోలీసుల సిబ్బంది సంఖ్య రోజురోజుకి పెరగుతోంది. గడచిన 24 గంటల్లో మరో 236 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 98కు చేరింది. మహారాష్ట్రలో కరోనా బారినపడిన పోలీసుల సంఖ్య 8958కు చేరింది. ఇప్పటి వరకు 6,962 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,898 మంది పోలీసులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story