స్వీయ నిర్బంధంలోకి తమిళనాడు గవర్నర్

స్వీయ నిర్బంధంలోకి తమిళనాడు గవర్నర్
X

తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్‌ పురోహిత్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. రాజ్‌భవన్‌లో తాజాగా ముగ్గురుకి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత పది రోజుల నుంచి తమిళనాడు రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. రాజ్‌భవన్‌లో పనిచేసే 84మంది సిబ్బందికి గతవారం కరోనా సోకింది. అయితే, ఇందులో ఏ ఒక్కరు కూడా గవర్నర్ ను కానీ, అక్కడి సీనియర్ అధికారులను గానీ కాంటాక్ట్ అవ్వలేదని రాజ్‌భవన్‌ ప్రకటించింది. అయితే, తాజాగా మరో 38మందికి కరోనా పరీక్షలు చేపించగా.. ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు గవర్నర్ ఏడు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటారని రాజ్‌భవన్‌ అధికారులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని.. ముందు జాగ్రత్తలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టంచేశారు.

Tags

Next Story