అయోధ్య రామాలయ పూజారికి కరోనా పాజిటివ్

రామాలయ నిర్మాణానికి భూమి పూజకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అయోధ్యలో కరోనా కలకలం రేపుతుంది. రామ జన్మభూమి పూజారి ప్రదీప్ దాస్‌కు కరోనా సోకిందని తెలుస్తుంది. ఈయనతో పాటు అక్కడ రక్షణ విధులు నిర్వహిస్తున్న 16 మందికి పోలీసులకు కరోనా సోకింది. ప్రదీప్ దాస్ తో పాటు మరో నలుగురు పూజారులు ఉంటారు. ప్రదీప్ దాస్‌కు కరోనా సోకడంతో ఆయన స్వీయ నిర్భంధంలో కి వెళ్లిపోయారు. కరోనా సోకిన 16 మంది పోలీసులు కూడా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. కాగా.. ఆగస్టు5న జరగనున్న రామమందిర నిర్మాణం భూమి పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.

Tags

Next Story