భారత్‌లో ల్యాండ్ అయిన రాఫెల్ విమానాలు

భారత్‌లో ల్యాండ్ అయిన రాఫెల్ విమానాలు
X

సుధీర్ఘ కాలం నుంచి ఎదురు చూస్తున్న అత్యాదునిక రాఫెల్ విమానాలు భారత వైమానిక దళంలోకి చేరాయి. మొదటి దశ డెలివరీలో భాగంగా ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఇవాళ హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో ల్యాండ్ అయ్యాయి. దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. సోమవారం ప్రాన్సు నుంచి బయలు దేరి ఏడు గంటలు ప్రయాణించి యూఏఈలో ఇందనం కోసం ల్యాండ్ అయ్యాయి. మంగళవారం 30వేల అడుగులు ఎత్తులోనే రాఫెల్ విమానాలు ఇందనాన్ని నింపుకున్నాయి. బుధవారం మద్యాహ్నం 3:31 గంటలకు విమానాలు ల్యాండ్ కాగానే సంప్రదాయం ప్రకారం వాటర్ సెల్యూట్ ఇచ్చారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు 220 కిలోమీటర్ల దూరంలో అంబాలా వైమానిక స్థావరం ఉంది. ఈ స్థావరంలో ల్యాండ్ అయ్యాయి. కాగా.. 2016లో ఫ్రాన్స్‌కి చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి మొత్తం 36 రాఫెల్ విమానాల కోసం భారత్ రూ.59 వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Tags

Next Story