ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నా: సుమలత

By - TV5 Telugu |30 July 2020 2:12 AM IST
ప్లాస్మా దానం చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని.. సినీ నటి, ఎంపీ సుమలత అంబరీష్ ప్రకటించారు. ఇటీవల కరోనా సోకిన ఆమె చికిత్స పొంది రికవరీ అయ్యారు. దీంతో, ఆమె ఈ మేరకు ప్రకటించారు. ప్లాస్మా దానానికి వైద్యులు పరిమిషన్ కోసం ఎదురు చూస్తున్నాని అన్నారు. కరోనా నుంచి తాను కోలుకున్నానని.. అయితే, కోలుకున్న తరువాత 28 రోజులు పాటు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆ తరువాత యాంటీజెన్ టెస్ట్ ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ స్థాయిని నిర్ధారించాల్సి ఉందని అన్నారు. అంతా బాగుంటే.. ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నానని సుమలత అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

