43మంది కరోనా బాధితులు పరార్

43మంది కరోనా బాధితులు పరార్
X

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నారు. అయితే, చాలా మంది కరోనా పెషెంట్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా వ్యాప్తి అడ్డుకట్ట పడకపోవడం పక్కన పెడితే.. మరింత వ్యాప్తి చెందుతుంది. ఉత్తరప్రదేశ్‌లో 43 మంది కరోనా రోగులు పరార్ అయినట్టు తెలుస్తుంది. ఘాజీపూర్‌లో 43 మంది కరోనా రోగుల జాడ తెలియడం లేదని అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేకే వర్మ.. జిల్లా అదనపు మెజిస్టేట్‌కు లేఖ రాశారు. ఈ 43 మందికి కరోనా పరీక్షలు చేసిన సమయంలో వారు ఫోన్ నంబర్లు, అడ్రెస్‌లు తప్పుగా ఇచ్చారని లేఖలో వివరించారు. వీరంతా ఆసుపత్రి లో కానీ, హోం ఐసోలేషన్‌లో కానీ లేరని ఆయన వెల్లడించారు. వీరి జాడ కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు లేఖలో వివరించారు.

Tags

Next Story