కరోనా వ్యాక్సిన్ గురించి కీలక సమాచారం తెలిపిన కేంద్రం

కేంద్ర వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కరోనా వ్యాక్సిన్‌కు పలు కీలక అంశాలు తెలిపారు. అమెరికా, చైనా, రష్యాకు చెందిన మూడు వ్యాక్సిన్‌లు తయారయ్యాయని అన్నారు. అయితే, ప్రస్తుతం అవి క్లినికల్ ట్రయల్స్‌లో ఫేజ్-3 దశలో ఉన్నాయని ఆయన తెలిపారు.
మరోవైపు భారతీయ శాస్త్రవేత్తలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నారని ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు సిద్ధం చేశారని అన్నారు. అయితే, ఒక వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో ఫేజ్ 1 దశలో ఉండగా.. మరో వ్యాక్సిన్ రెండో దశలో ఉందని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ లో ఆశించిన ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు.
అటు, భారత్ లో రికవరీ రేటు కూడా ఆశాజనకంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఏప్రిల్ లో 7.85 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 64.4 శాతంగా ఉందని.. రికవరీ రేటు గణనీయంగా ఉందని రాజేష్ భూషణ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com