కరోనా కారణంగా 102 మంది పోలీసులు మృతి

కరోనా కారణంగా 102 మంది పోలీసులు మృతి
X

మహారాష్ట్రలో కరోనా స్వైర విహారం చేస్తోంది. పోలీసు శాఖలో ఈ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖలో ఇప్పటి వరకు కరోనా వల్ల 100 మందికి పైగా మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో మరో 121 మంది పోలీస్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర పోలీస్‌శాఖ తెలిపింది.

తాజాగా గడిచిన 24గంటల వ్యవధిలో మరో ఇద్దరు పోలీసులు కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ శాఖలో కరోనా మరణాల సంఖ్య 102కు చేరింది. ఇందులో 8 మంది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మహా పోలీసు డిపార్ట్‌మెంటులో మొత్తం 9217 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 7,176 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,939 యాక్టివ్‌ కేసులున్నాయి.

Tags

Next Story