31 July 2020 3:10 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / తైవాన్ కంపెనీలు భారత్...

తైవాన్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి: చైనా మీడియా

కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. పెట్టుబడులను ఆకర్షించడానికి పలు దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సమయంలో భారత్ లో చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తైవాన్ కు చెందిన పలు కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని తెలుస్తుంది. అయితే, ఈ విషయాన్ని చైనా మీడియా వర్గాలు స్వయంగా తెలిపాయి. చైనాతో తైవాన్‌కు ఉన్న పలు వివాదాలు, భారత్ మార్కెట్ కు ఉన్న డిమాండ్.. దీనికి కారణమని చెబుతున్నారు. దీంతో పాటు భారత్ లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు చౌకగా దొరుకుతారని..

పన్నులు కూడా చాలా తక్కువగా ఉండటంతో తైవాన్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని తెలిపింది. అమెరికా టెక్ జెయింట్ యాపిల్‌కు అసెంబ్లీ పార్టనర్ అయిన తైవాన్ కంపెనీ పెగట్రాన్ ఇటీవల చేసిన ప్రకటనలో భారతదేశంలో తన మొదటి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు పేర్కొందని చైనా మీడియా తెలిపింది. పెగట్రాన్ కంపెనీ ఒక ఉదాహరణ మాత్రమేనని.. మరిన్ని కంపెనీలు భారత్ వైపు తరలి వస్తాయని తెలిపింది. అయితే, ఇప్పటి పరిస్థితులు మాత్రమే కంపెనీల తరలింపుకు కారణం కాదని.. గత నాలుగేళ్ల నుంచి భారత్, తైవాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయని తెలిపింది.

Next Story