దేశంలో 36 వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పాజటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 57 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 17 లక్షల మార్కుకు నాలుగు వేల దూరంలో నిలిచాయి.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 57,117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే 764 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,95,988కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు 36,511కు పెరిగాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,65,103 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరో 10,94,374 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా రికవరీ రేటు 65 శాతానికి చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

