యువత కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు: డబ్ల్యూహెచ్ఓ

X
By - TV5 Telugu |1 Aug 2020 1:09 AM IST
కరోనా ఎక్కువగా వృద్దులకు, చిన్న పిల్లలు సోకుతుందని.. వారికే ప్రాణాపాయం ఉందని చాలా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మహమ్మారి ప్రభావం యువతపై కూడా ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని తెలియజేశామని.. ఈ మహమ్మారి ఉద్రితిని చూస్తే మరోసారి చెప్పాల్సి వస్తుందని అన్నారు. ఇటీవ కాలంలో యువత ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. యువత కరోనాతో మృతి చెందే అవకాశం ఉందని అన్నారు. మరోవైపు ఈ కరోనా కాలంలో కూడా చాలా మంది విహారయాత్రలకు వెళ్తున్నారని.. దీంతో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com