తమిళనాడులో కలకల రేపుతున్న కరోనా మరణాలు

తమిళనాడులో కలకల రేపుతున్న కరోనా మరణాలు
X

తమిళనాడులో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మరణాల సంఖ్య మాత్రం రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,609 కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 2,63,222 చేరింది. అటు, సోమవారం ఒక్కరోజే 109 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 4,241కి చేరాయి. అయితే, రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదైనా.. ఇంకా 56,698మంది మాత్రమే యాక్టివ్ లో ఉన్నారు. మిగిలిన వారు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Tags

Next Story