ఆక్స్‌ఫర్డ్ టీకాపై క్లినికల్ ట్రయల్స్ చేయనున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తున్న కరోనా టీకాపై ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వ అనుమతి లభించింది. టీకా పనితనంపై భారత్ లో పరిక్షలు నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి జారీ చేసింది. టీకాపై జరిగనున్న ట్రయల్స్‌లో పాల్గొన్న వారికి రెండు టీకా డోసులు ఇస్తారని, మొదటి డోసు ఇచ్చిన తరువాత 29వ రోజున రెండో డోసు ఇస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరువాత.. ఈ టీకా పనితీరు ఎలా ఉంది? దీని వలన రోగనిరోదక శక్తి ప్రేరేపితమవుతుందా? లేదా? దీని వలన ఏమైనా ప్రతికూల ప్రభావం పడుతుందా అనేది ఈ ట్రయల్స్ లో నిర్థారణ అవుతుందని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ ఫేజ్ 1,2 ట్రయల్స్ సంబంధించిన రిపోర్టులను పరిశీలించిన తరువాత డీసీజీఐ ఈ అనుమతులు జారీ చేసింది. కాగా.. ప్రస్తుతం ఈ టీకాపై బ్రిటన్‌లో ఫేజ్-2, 3 దశల పరీక్షలు జరగుతుండగా బ్రెజిల్‌లో ఫేజ్-3, దక్షిణాఫ్రికాలో ఫేజ్-1,2 పరీక్షలు జరుగుతున్నాయి. ప్రజలకు కరోనా టీకాను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ దశల పరీక్షలను అధికారులు వేగవంతం చేస్తున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com