వంటింటి చిట్కాలే వైద్యం.. 'ఆవిరి'తో వైరస్ అంతం

కరోనా వైరస్ ని అంతమొందించాలంటే వంటింటి చిట్కాలకు మించిన వైద్యం లేదని భావిస్తున్నారు ప్రస్తుతం ప్రతి ఒక్కరు.. అందుకేనేమో కరోనా ప్రభావంతో ప్రతి ఇల్లు ఒక వైద్యశాలగా మారిపోయింది. వైద్యుల సలహాలు, సూచనలతో, సేకరించిన వార్తా సమాచారంతో ఎవరికి వారు సొంత వైద్యం బాట పడుతున్నారు. కరోనాని దరి చేరనివ్వకుండా చూసుకుంటున్నారు. మనకు తెలిసినవేవో పాటిస్తే వైరస్ దరిచేరకుండా కొంతైనా నివారించగలుగుతామని కషాయాలు తాగడం, ఆవిరిపట్టడం లాంటివి ప్రతి ఇంట్లో దినచర్యలో భాగం చేసుకుంటున్నారు.
వైద్యులు సైతం ఆవిరి చికిత్సకు ఓటేస్తున్నారు. తాజాగా ముంబయిలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రి వైద్యులు 3నెలలుగా పరిశోధన నిర్వహించి స్టీమ్ థెరపీ కరోనా చికిత్సలో ప్రధాన ఔషధంగా ఉపయోగపడుతున్నట్లు వెల్లడించారు. ఆస్సత్రికి చెందిన డా.దిలీప్ పవార్ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. ఆవిరి పట్టిన వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు.
ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఆవిరి పట్టడం ద్వారా త్వరితగతిన కోలుకున్నారు. రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం ద్వారా మూడు రోజుల్లోనే రికవరీ అయ్యారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ప్రతి మూడు గంటలకి ఒకసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టగా వారంలో సాధారణ స్థితికి వచ్చారు. ఈజీ బ్రీత్ క్యాప్సుల్స్, విక్స్, పసుపు వంటివి వేడి నీటిలో వేసి ఆవిరి పట్టడం ద్వారా నాజిల్స్ ఫ్రీ అవుతాయని, వైరస్ నీర్వీర్యం అవుతుందని తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com