అంతర్జాతీయం

పరిస్థితులు మారాయి.. అప్రమత్తంగా ఉండాలి: వైట్‌హౌస్

పరిస్థితులు మారాయి.. అప్రమత్తంగా ఉండాలి: వైట్‌హౌస్
X

వైట్‌హౌస్ కరోనా వ్యాప్తిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాలో కరోనా వ్యాప్తి కొత్తదశకు చేరుకుందని.. పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లో కూడా ఈ మహమ్మారి వ్యాప్తి దారణంగా ఉందని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాల అధికారులు కరోనా కట్టడికి కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ తో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకూ పల్లె ప్రాంతాల్లో ఈ మహమ్మారిని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని.. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయని.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రమాదం తప్పదని అన్నారు. పల్లె ప్రాంతాల వారు కరోనాకు అతీతం కాదని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని అన్నారు. లేని యడల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని అన్నారు.

Next Story

RELATED STORIES