కరోనా వ్యాక్సిన్ సమీప భవిష్యత్‌‌లో ఉండకపోవచ్చు: డబ్ల్యూహెచ్ఓ

కరోనా వ్యాక్సిన్ సమీప భవిష్యత్‌‌లో ఉండకపోవచ్చు: డబ్ల్యూహెచ్ఓ

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తం విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచంలో పలు మెడికల్ ల్యాబ్ లు ప్రయోగాలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీలో వివిధ ధశల్లో ఉన్నాయి. కొన్ని కంపెనీలు కరోనా వ్యాక్సిన్ లో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ కరోనా వ్యాక్సిన విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాక్సిన్ సమీప భవిష్యత్ లో వస్తుంది అనేది అనుమానమేని షాకింగ్ కామెంట్స్ చేసింది. సామాజిక దూరం, మాస్కులు, శానిటైజర్ల వాడకం, వ్యక్తిగత శుభ్రత పాటించడం లాంటివి

నిత్యజీవతంలో బాగం చేసుకోవాలని తెలిపింది. ఇప్పట్లో ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఉండకపోవచ్చని.. భవిష్యత్ లో కూడా అనుమానమేనని అన్నారు. అయితే, డబ్ల్యూహెచ్ఓ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇది తొలిసారి కాదు. గత నెల కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. గత నెల కూడా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడామ్ గిబ్రేయెసస్ మాట్లాడుతూ... సామాజిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం లాంటి కనీస జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందేనన్నారు. ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని.. లేని యడల ఈ మహమ్మారి మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వస్తుందని ఆశించడం అత్యాశ అవుతుందని

అన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story