కరోనా కంట్రోల్ అయితేనే ఎకానమి గెయిన్

కరోనా కంట్రోల్ అయితేనే ఎకానమి గెయిన్
X

కరోనా కంట్రోల్ కాకుండా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటం అసాధ్యమని తేల్చింది కేంద్ర ఆర్థికశాఖ. ముఖ్యంగా పారిశ్రామిక రాష్ట్రాల్లో కోవిడ్ తీవ్రత అధికంగా ఉండటంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని హెచ్చరించింది. జులై పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ -PMI 45కు పడిపోయింది. జూన్ లో 47.2గా ఉంది. అన్ లాక్ ఉన్నా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. డిమాండ్ పడిపోయింది. బిజినెస్ యాక్టివిటి మొత్తం తగ్గిపోయింది.

కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కరోజు హయ్యస్ట్ కేసుల్లో అమెరికాను దాటేసింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత జూన్ లో 5.6లక్షల కేసులున్నాయి. జులైలో 166శాతం పెరిగాయి. దేశీయంగా పారిశ్రామికంగా మంచి గ్రోత్ ఉన్న రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ అధికంగా ఉంది. 12 రాష్ట్రాల్లో 75శాతం కేసులున్నాయి. మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ఇండస్ట్రీయల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. రీజనల్ లాక్ డౌన్స్ కారణంగా మొత్తం ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.

ఇప్పటికే ప్రభుత్వానికి GSTకూడా దారుణంగా పడిపోయింది. రానున్న రోజుల్లో కరోనా మరింత తీవ్రంగా ఉంటుందన్న అంచనాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఆర్థికంగా జరిగే నష్టం భారీగా ఉంటుందని చెబుతున్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ పై ఆధారపడి ఉంటుందన్నది సుస్పష్టమవుతోంది.

Tags

Next Story