తెలంగాణలో కొత్త‌గా 2012 క‌రోనా కేసులు

తెలంగాణలో కొత్త‌గా 2012 క‌రోనా కేసులు
X

తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2012 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 70,958 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 19,568 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 576 కి చేరింది. ఇక రాష్ట్రంలో కొత్త‌గా 1139 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య‌ 50,814కి చేరింది.

Tags

Next Story