త్రిపుర సీఎంకు కరోనా నెగిటివ్.. అయినా..

త్రిపుర సీఎంకు కరోనా నెగిటివ్.. అయినా..
X

కరోనా పరీక్షలు చేసుకున్న త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ ఫలితాల గురించి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిందని వైద్యులు నిర్థారించారు. కరోనా నెగిటివ్ అని వచ్చినా.. తాను 7 రోజులు హోం క్వారంటైన్ లో ఉంటానని ఆయన ప్రకటించారు. అక్కడి నుంచే తన విధులు నిర్వహిస్తానని ఆయన అన్నారు. కరోనాపై విరామం లేని పోరాటం చేస్తున్నామని.. దీనిపై విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా.. తన ఇంట్లో ఇద్దరికి కరోనా సోకడంతో తాను ఐసోలేషన్ లోకి వెళ్లానని ప్రకటించిన విషయం తెలిసిందే. తన ఇంట్లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చిందని.. మిగతా వారికి నెగిటివ్ అని వచ్చిందని తెలిపారు. తాను కూడా కరోనా పరీక్ష చేపించుకున్నాని.. రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్థారించారు.

Tags

Next Story