ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తుంది. సామాన్యులతోనే కాకుండా.. సెలబ్రిటీలకు కూడా కరోనా సోకుతుంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలకు కరోనా సోకింది. కాగా.. తాజాగా ప్రముఖు సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్థారించారు. ఈ విషయాన్ని ఆయనే ఓ వీడియో ద్వారా తెలియజేశారు. గత రెండు రోజుల నుంచి జ్వరం, దగ్గు ఇబ్బందిపడుతున్నానని.. దీంతో కరోనా పరీక్షలు చేపించుకోగా.. పాజిటివ్ అని వచ్చిందని తేలిందని ఆయన తెలిపారు. అయితే, కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉందని అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. ఆరోగ్యం బాగానే ఉందని.. అభిమానుల ఆశీస్సులతో త్వరగా కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story