బ్రెజిల్‌లో కరోనా విశ్వరూపం..

బ్రెజిల్‌లో కరోనా విశ్వరూపం..
X

కరోనా కేసులు బ్రెజిల్‌లో అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 16,641 కేసులు నమోదు కాగా, 561 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసులు 27,50,318కి చేరగా, మృతుల సంఖ్య 95,665కి చేరింది. బ్రెజిల్ లోని సావొపా అనే రాష్ట్రం కరోనాకు కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ అత్యధిక జనాభా ఉండడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీన తరువాత అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం రియో డి జనైరోలో. లాటిన్ అమెరికాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో భారత్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలు ఉన్నాయి.

Tags

Next Story