అనంతపురం జిల్లాలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న కరోనా వృద్దురాలు

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలం కమలపాడు గ్రామంలో ఓ కరోనా వృద్దురాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఐదు రోజుల క్రితం ఈ వృద్దురాలుకు కరోనా సోకింది. అయితే, అధికారులు ఒక రోజు క్వారంటైన్‌లో ఉంచి తరువాత హోం ఐసోలేషన్ లో ఉండాలని పంపించేశారు. కాగా.. నాలుగు రోజుల తరువాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంట్లో ఆమెను ప్రత్యేక గదిలో ఉంచి.. ఎవరూ తన బాగోగలు చూసుకోకపోవడంతో ఆమె మనస్థాపానికి గురై ఇంట్లోనే చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Next Story