జనం నేత.. జగనన్నకు గుడి

జనం నేత.. జగనన్నకు గుడి

ఇప్పటి వరకు సినిమాతారలకు అభిమానులు గుడి కట్టడం చూశాం. అదీ తమిళనాట మాత్రమే. కానీ తమ అభిమాన రాజకీయ నాయకులకు గుడి కట్టిన దాఖలాలు ఇంతవరకు చూడలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ అదృష్టానికి నోచుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెం వైకాపా నాయకులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరిట ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా గుర్తుండి పోయేవిధంగా ఈ కార్యక్రామాన్ని తలపెట్టామని వైసీపీ నేత కురకూరి నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. ఆయన నీడలో రాష్ట్రం సస్యామలంగా ఉండాలని కోరుకుంటూ జగనన్నను దేవుడిలా భావించి కోవెల కడుతున్నట్లు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెప్పారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు దేశంలో ఎవరూ చేయని విధంగా వేల కిలోమీటరల్ు రాజశేఖర్ రెడ్డి, జగన్ పాదయాత్ర చేశారని గుర్తు చేసుకున్నారు.

Tags

Next Story