గుజరాత్‌లో అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం

గుజరాత్‌లో అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం

అహ్మదాబాద్‌లోని కరోనా ఆస్పత్రిలో అగ్ని‌ప్రమాదం జరిగి 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ ఘటనపై గుజరాత్ సీఎంతో మాట్లాడానని.. భాదిత కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉండాలని ఆదేశించానని తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదానికి గురైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి 50వేల రూపాయలు సాయాన్ని అందిస్తున్నట్టు పీఎంఓ ట్వీట్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story