ఒక్కరోజులో 2వేల పాజిటివ్ కేసులు..

ఒక్కరోజులో 2వేల పాజిటివ్ కేసులు..
X

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మంగళవారం 2,012 నమోదయ్యాయి. ఒక్కరోజులో 2వేలకు పైగా కేసులు నమోదవడం ఈ అయిదు రోజుల్లో ఇది రెండవసారి. మంగళవారం రాత్రి 8 గంటల వరకు నమోదైన కరోన కేసుల సమాచారాన్ని బుధవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 70,958కి చేరింది. ఇక మంగళవారం కోలుకున్న వారి సంఖ్య రాష్ట్రం మొత్తంలో 1,139 మంది. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారు 50,814కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాలు 576కు చేరుకుంది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 19,568మంది. హోం ఐసోలేషన్ లో ఉన్న వారు 84 శాతం కాగా వీరిలో ఎలాంటి లక్షణాలు లేవని నివేదికలో వెల్లడైంది.

ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 71 ఏళ్ల పైబడిన వారు 3.2 శాతం ఉంటే, 21-40 ఏళ్ల మధ్య వారు 47.1 శాతంగా ఉన్నారు. మృతి చెందిన వారు 46.13 శాతం కాగా, కరోనాతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉండి మరణించిన వారు 53.87 శాతం ఉన్నారు.

Tags

Next Story